యువతి ముఖం ఏలియన్ తినేశాడట !

Telugu Lo Computer
0


పెరూ దేశంలోని పెరువియన్ గ్రామంలోని కొంతమంది నివాసితులు 7 అడుగుల ఎగిరే గ్రహాంతరవాసులు గ్రామాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు. అనంతరం ఓ మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఆమె ముఖాన్ని తినేశారని అన్నారు. ఒక మహిళ కూడా తన మొబైల్‌లో గ్రహాంతరవాసిని ఫోటో తీసినట్లు పేర్కొంది. తను తీసిన ఫొటో చూపించింది కూడా. పెరూవియన్ చట్ట అమలు అధికారులు గ్రహాంతరవాసుల వీక్షణలను క్లెయిమ్ చేసే నివేదికలను విశ్వసించడం లేదు. గ్రామస్తులు ‘పెలకరా’ (ముఖం తినేవాళ్ళు) అని నమ్మేవారు వాస్తవానికి మధ్య మరియు దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి అక్రమ బంగారు మైనింగ్ సిండికేట్ సభ్యులని అనుమానాలు లేవనెత్తారు. అయితే పెరూవియన్ గ్రామస్తులు చెప్పిన విషయాల్ని బ్రెజిల్‌కు చెందిన ఓ ప్రైమిరో కమాండో డా క్యాపిటల్, కొలంబియా క్లాన్ డెల్ గోల్ఫో కొట్టి పారేస్తున్నారు. దశాబ్దాలుగా లాటిన్ అమెరికాను నియంత్రించిన ఎఫ్ఏఆర్‭సీ వంటి డ్రగ్ కార్టెల్స్‌తో ముడిపడి ఉన్న బంగారు మాఫియాకి చెందినవారని, వారిని గ్రహాంతరవాసులుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఇక తాము చూసినట్లుగా భావిస్తున్న గ్రహాంతరవాసుల గురించి ఇకితు అనే గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. వారి తల పెద్దగా ఉందని, శరీరం రంగు వెండిలా ఉందని, గ్రహాంతరవాసులు నలుపు రంగు హుడ్స్ ధరించినట్లు తెలిపారు. మన ఆయుధాలు గ్రహాంతరవాసులపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని వారు చెప్పడం గమనార్హం. ఆగస్టు 11న గ్రహాంతరవాసుల దాడి జరిగిందని, ఇకితు నాయకుడు అవిలా అన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)