రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్‌లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్రం అంగీకరించిందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మణిపూర్ ఇష్యూ వల్ల పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజ్యసభలో విపక్ష ఎంపీలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ చేసిన ఓ ట్వీట్ ఆ సంకేతాన్ని ఇస్తోంది. ప్రతిష్టంభన తొలిగిపోవడానికి ఇండియా కూటమి మధ్యేమార్గాన్ని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు. మణిపూర్ అంశంపై రూల్ 267 కింద సుదీర్ఘ చర్చ చేపట్టాలని, ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రూల్ 176 కింద ఆ అంశంపై చర్చకు సిద్ధమే అని కేంద్రం చెబుతోంది. కానీ పార్లమెంట్ ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నాసభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు. వాయిదాల పర్వంతో సమయం అంతా వృధా పోతోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కొత్త ప్రతిపాదన చేసింది. రూల్ 167 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు సూచించినట్లు తెలుస్తోంది. అయితే రూల్ 167 కింద ఆ అంశంపై ఓటింగ్ కూడా ఉంటుంది.
రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రె"ఢీ" ?
August 03, 2023
0
Tags