ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్కా ధరించిన వ్యక్తి !

Telugu Lo Computer
0


చిత బస్సు ప్రయాణం కోసం బుర్కా ధరించి ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని కర్నాటకలో పట్టుకన్నారు. బుర్కాతో ఉన్న ఆ వ్యక్తిని వీరభద్రయ్యగా గుర్తించారు. కర్నాటకలో ప్రస్తుతం శక్తి యోజన కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి బుర్కా ధరించినట్లు తెలుస్తోంది. బస్సు స్టాప్‌లో ఒంటరిగా ఉన్న అతనిపై అనుమానం రావడంతో స్థానికులు అతన్ని నిలదీశారు. యాచన కోసమే బుర్కా ధరించినట్లు అతను చెప్పాడు. కానీ అతను ఇచ్చిన వివరణతో అక్కడవాళ్లు సంతృప్తి పడలేదు. శక్తి యోజన కింద ఉచిత బస్సు ప్రయాణం కోసం అతను బుర్కా వేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అతని వద్ద ఓ మహిళకు చెందిన ఆధార్ కార్డు కూడా ఉంది. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)