పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. 'రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం'' అని జస్టిస్ హేమంత్ ప్రచక్ తీర్పు వెలువరించారు. జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఈ కేసులో రాహుల్ ఇప్పుడే జైలుకు వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. శిక్ష అమలును హోల్డ్ చేస్తూ గతంలో న్యాయస్థానం ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. కాగా గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. https://t.me/offerbazaramzon
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ స్టే పిటిషన్ కొట్టివేత !
July 07, 2023
0
Tags