తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మోరంచపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బురదమయైన ఇళ్లను, కొట్టుకుపోయి చెట్లకు ఇరుక్కుపోయిన వాహనాలను పరిశీలించి గ్రామంలో పరిస్థితిని చూసి చలించిపోయారు. వరదలకు గల్లంతైన గడ్డం మహాలక్ష్మి, గంగిడి సరోజన, ర్యాకం విజయ, నర్సారెడ్డితో పాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నాటి ఘటనను వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అన్నింటిని వదలి పరిగెత్తిన పరిస్థితిని కిషన్‌రెడ్డికి బాధితులు గ్రామస్తులు వివరించారు. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది, ఒక ఇల్లు కూడా మళ్లీ ఉండేందుకు పనికిరాకుండా పోయిందని, గూడు, గొడ్డు అంతా పోయిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో వస్తువులేని పనికిరాకుండా పోయాయని విలపించారు. వారి బాధను చూసి ఉద్వేగానికి గురైన కిషన్‌రెడ్డి బాధితులతో మాట్లాడి వారి బాధలను విని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయని ఆనిధులతో బాధితులను విధాల ఆదుకోవాలన్నారు. మృతులకు ఇచ్చే రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాలో 75 శాతం (3లక్షలు) కేంద్రం ఇచ్చినవేనని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లిష్టపరిస్థితిలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాధితులను కేంద్ర ప్రభుత్వం కూడా అనుకుంటుందని తెలిపారు. కేంద్ర బృందాలు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని చెప్పారు. https://t.me/offerbazaramzon
మోరంచపల్లి ప్రజలను ఆదుకుంటాం !
July 30, 2023
0
Tags