స్పృహ తప్పి పట్టాలపై పడిపోయింది !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో బాబుపుర్ అనే గ్రామానికి చెందిన హరి ప్యారీ (40) అనే మహిళ మందులు కొనేందుకు సహవర్ అనే రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు సడెన్‌గా తల తిరిగింది. దీంతో స్పృహ తప్పిపోయి ఆ రైలు పట్టాలపైనే పడిపోయింది. ఆమెను కొంతమంది గమనించారు. కాపాడేందుకు పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే ఆమె పడిపోయిన ట్రాక్ లైన్‌లో ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఇక చేసేదేమీ లేక ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గూడ్స్ రైలు ఆమె ఉన్న ట్రాక్‌పై దూసుకొచ్చింది. కొన్ని బోగీలు వెళ్లేసరికి ఆమెకి మెళుకువ వచ్చింది. అక్కడున్న స్థానికులు ఆమె కాళ్ల, చెతులు కదపకుండా అలానే పడుకోవాలంటూ కేకలు వేశారు. ఇక ఆ రైలు పూర్తిగా వెళ్లిపోయాక ఆమెను పట్టాలపై నుంచి పక్కకు తీసుకొచ్చారు. అయితే హరి ప్యారీకి స్పల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)