డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు !

Telugu Lo Computer
0


ప్రతి రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు చాలా మంది ఫోన్‌ను చూస్తేనే ఉంటారు. వివిధ అవసరాల కోసం ఫోన్‌లో సెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇవే కాకుండా సోషల్ మీడియాని ఉపయోగించడం, గేమ్‌లు ఆడడం ఇంకా వీడియోలు చూడటం వంటి అనేక పనులను చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్‌ను దేనికి ఉపయోగిస్తున్నారో తెలిస్తే షాకవుతారు. ఎక్కువ మంది తమ స్మార్ట్ ఫోన్ వాడకంపై వివో ఇటీవల ఒక పరిశోధన నివేదికను ప్రచురించింది. అందులో భారతీయులు వారి స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా దేనిని ఉపయోగిస్తున్నారో చూపిస్తు ఈ వివరాలు నివేదికలో వెల్లడించింది. దేశం లోని జనాలు స్మార్ట్‌ఫోన్‌లు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. నివేదిక ప్రకారం సాధారణంగా యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి ఉపయోగిస్తున్నట్టు తేలింది. సుమారు 86 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి ఆఫీసులకు వెళ్లకుండా తమ సమయాన్ని ఆదా చేసుకుంటూ ప్రజలు స్మార్ట్ ఫోన్‌ ద్వారానే బిల్లులను చెల్లిస్తున్నట్టు నివేదిక ద్వారా బహిర్గతం అయింది. ఇది చాలా అనుకూలమైన పద్ధతని, ఇంకా చాలా సమయాన్ని ఆదా చేస్తుందని వినియోగదారులు చెబుతున్నట్టు నివేదికలో ప్రకటించింది. బిల్లుల చెల్లింపు కోసమే కాకుండా షాపింగ్ కోసం కూడా ఉపయోగించబడుతుంది. నివేదిక ప్రకారం 80.8 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. దాదాపు 61.8 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌ల నుంచి నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. 66.2 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఆన్‌లైన్‌లో సేవలను బుక్ చేసుకుంటున్నారు. 73.2 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ల నుండి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 58.3 శాతం మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్ నుండి డిజిటల్ క్యాష్ తో చెల్లింపులు చేస్తున్నారు. దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదికలో బయటపడింది. 62 శాతం మంది పురుషులు స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉండగా, 38 శాతం మంది మహిళలు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య వ్యత్యాసం కూడా బాగానే ఉంది. పట్టణ ప్రజలలో 58 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌ వాడుతుండగా.. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల్లో 41 శాతం మంది మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)