తమిళనాడులో మరోసారి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడిపై ఇవాళ ఈడీ దాడులు చేస్తోంది. మంత్రి పొన్ముడితో పాటు ఆయన కుమారుడు..లోక్‌సభ సభ్యుడు గౌతమ్ సిగమణికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. చెన్నైలోని మంత్రి పొన్ముడి ఇంటితో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విలుప్పురం జిల్లాలోని మంత్రి ఇల్లు, సూర్య ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.ఆయనను అరెస్ట్ చేసింది. https://t.me/offerbazaramzon
తమిళనాడు మంత్రి కె పొన్ముడి ఇంటిపై ఈడీ దాడులు
July 17, 2023
0
Tags