వందేభారత్‌ రైల్లో మంటలు

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైల్లో మంటలు చెలరేగాయి. భోపాల్‌లోని రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి బయలుదేరిన వందేభారత్ రైలు కుర్వాయి స్టేషన్‌ వద్దకు చేరుకోగానే సీ-14 కోచ్‌ వద్ద మంటలు చెలరేగాయి. కుర్వాయి స్టేషన్ వద్దకు రాగానే బ్యాటరీ నుంచి మంటలు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే సమాచారాన్ని లోకో పైలట్‌కు అందించారు. దీంతో రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)