మణిపూర్ లో మూడు నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల ప్రభావం ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాలపైనా పడుతోంది. ముఖ్యంగా తాజా అల్లర్లు, మణిపూర్ లో మహిళలపై అకృత్యం తర్వాత ఇతర ఈశాన్య రాష్ట్రాలు భయం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న మొయిటీల్లో ఈ భయం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గిరిజన తెగలైన కుకీలు తమపై దాడులకు దిగుతారన్న భయంతో మెయిటీలు ఇప్పుడు తమ స్వస్ధలాల్ని వదిలిపోతున్నారు. ఇవాళ మిజోరంలో 60 మంది మెయిటీలు రాష్ట్రం వదిలి విమానాల్లో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. మే 4న మణిపూర్‌లో ఇద్దరు కుకీ మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయనే భయంతో, దాదాపు 60 మంది మెయిటీ ప్రజలు ఇవాళ మిజోరాంలోని ఐజ్వాల్ నుండి విమానంలో బయలుదేరారు. చాలా మంది బస్సు, టాక్సీలో అస్సాంకు వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో మిగతా వారిలోనూ భయం మొదలైంది. మరోవైపు మణిపూర్ లో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన కేసులో ఐదో నిందితుడిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.అటు మణిపూర్‌లో జాతి హింస, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా ఆదివారం గుజరాత్‌లోని గిరిజన ప్రాంతంలో బంద్ పాటించనున్నట్లు గిరిజన నేతలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితిని అదుపు చేయడంలో అధికార బీజేపీ వైఫల్యానికి నిరసనగా బంద్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆదివాసీ ఏక్తా మంచ్‌తో సహా పలు గిరిజన సంఘాలు గుజరాత్‌లోని గిరిజనులు అధికంగా ఉండే జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసనల హోరు తీవ్రం కావడంతో , అరెస్టు చేసిన వారిని నిన్న 11 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ఈ కేసుకు సంబంధించి రెండవ సంఘటనలో కోపంతో ఉన్న స్థానికులు మరొక అనుమానితుడి ఇంటికి నిప్పు పెట్టారు. మణిపూర్ హింసపై చర్చ జరగకుండా పార్లమెంట్‌లో ప్రతిష్టంభన నెలకొని ఉన్న నేపథ్యంలో, ఉభయ సభల్లో ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ఒత్తిడి చేసేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు జూలై 24న పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు ప్లాన్ చేశారు. https://t.me/offerbazaramzon
అల్లర్ల భయంతో మిజోరంలో మెయిటీల వలసలు ?
July 22, 2023
0
Tags