రూ.10 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ.10 కోట్ల విలువైన విదేశీ నోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు తజికిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఓ మైనర్ కూడా ఉన్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. లగేజీలో ఉంచిన బూట్లలో విదేశీ కరెన్సీని దాచి ఉంచినట్లు సమాచారం. నిందితులు ఇస్తాంబుల్‌కు విమానం ఎక్కేందుకు వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగేజీని చెక్ చేయగా కరెన్సీ బయటపడ్డాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)