కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన మహమ్మద్ మొయిదీన్ అనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ మొయిదీన్ బాటిక్ ఎయిర్ విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోగానే కస్టమ్స్ అధికారులు మొయిదీన్ ను అడ్డుకున్నారు. అతని ట్రాలీ బ్యాగులు విప్పి చూడగానే అందులో కొండచిలువలు దర్శనమివ్వడంతో కస్టమ్స్ అధికారులు షాక్ కు గురయ్యారు. అటవీశాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం కొండచిలువలను తిరిగి మలేషియాకు పంపించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. విచారణ నిమిత్తం మొయిదీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
విమానంలో కొండచిలువలు తెచ్చిన ప్రయాణికుడు !
July 31, 2023
0
Tags