వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోడీ ఉన్నారని, ఎన్నికల్లో ఓటమి తర్వాత విదేశాల్లో ఆశ్రయం కోసం వెతుకుతున్నారని, అందుకే ప్రధాని విదేశాలను సందర్శిస్తున్నారని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. కొత్త కూటమి ఇండియాను ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మోడీ చేసిన క్విట్ ఇండియా వ్యాఖ్యలపై లాలూ స్పందించారు. విదేశాల్లో పిజ్జాలు, మెమోస్, చౌ మెయిన్ లను అస్వాదించగల ప్రదేశాన్ని మోడీ వెతుకుతున్నారని లాలూ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కోలుకొని బ్యాడ్మింటన్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించిన లాలూ మోడీపై విమర్శలు కురిపించారు. https://t.me/offerbazaramzon
ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోడీ ఉన్నారు !
July 31, 2023
0
Tags