కొండలపై నుంచి రాళ్లు వాహనంపై పడటంతో నలుగురు మృతి

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని గంగోత్రి వద్ద ప్రయాణీకులు యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా బండరాళ్లు వాహనాలపై పడటంతో వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు డీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భారీ వర్షం కారణంగా కొండలపై నుంచి రాళ్లు పడిపోవడంతో మూడు వాహనాలు ధ్వంసమైన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. సుమారు 30 మంది ప్రయాణికులతో మూడు వాహనాలు కొండ పక్కనే ఉన్న రోడ్డుపై వెళుతుండగా బండరాళ్లు దొర్లుతూ వచ్చి వాహనాలపై పడ్డాయి. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవారని తెలిసింది.ధ్వంసమైన వాహనాల అవశేషాలు ప్రమాద స్థాయిని తెలియజేస్తున్నాయి. చిన్న బస్సు ఒకవైపు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మరో రెండు చిన్న వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)