వివాహ సంబంధిత సమస్యలతో భర్తల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారు గృహహింసకు గురవుతున్నారని అలాంటివారి కోసం 'జాతీయ పురుషుల కమిషన్' ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ''పెళ్లైన తొలి మూడేళ్లలోనే ఎంత మంది యువతులు చనిపోతున్నారో మీకు తెలుసా ? ఇక్కడ ఎవరిపైనా తప్పుగా సానుభూతి చూపే ప్రశ్నే లేదు. భార్యల వేధింపుల కారణంగానే ఈ భర్తలంతా చనిపోతున్నారని మేం భావించాలని మీరు అనుకుంటే అది పొరపాటు. దాన్ని మేం అంగీకరించం'' అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ వ్యాఖ్యానించింది. న్యాయం పొందడానికి గృహహింసకు గురైన పురుషులకు చట్టంలో అనేక నిబంధనలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. పిటిషనర్ తన పిటిషన్‌లో జాతీయ నేర గణాంక విభాగం డేటాను ప్రస్తావించారు. దీని ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్య చేసుకుంటే, అందులో 81,063 మంది పెళ్లైన పురుషులని, వివాహిత మహిళలు కేవలం 26,680 మాత్రమేనని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంగా 33.2% పురుషులు ఆ ఏడాది తమ జీవితాలను అంతమొందించుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లైన మగవాళ్లలో ఆత్మహత్యలను నివారించడానికి గాను, గృహ హింసపై పురుషులు ఇచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకునేలా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్ మహేశ్ కుమార్ తివారీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. https://t.me/offerbazaramzon
'జాతీయ పురుషుల కమిషన్' పిటిషన్‌ను తిరస్కరణ !
July 04, 2023
0
Tags