ఎలక్షన్‌ డ్యూటీని తప్పించుకునేందుకు విద్యా వాలంటీర్ల ఎత్తుగడ !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లోని అలిపురద్వార్‌ జిల్లా జటేశ్వర్‌ గ్రామంలో తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విద్యా వాలంటీర్లు నివ్వెరపోయే ప్రణాళిక వేశారు. జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్‌ డ్యూటీని తప్పించుకునేందుకు వీరంతా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందుకోసం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ విచిత్ర ఘటన ఈ ఏడుగురు వాలంటీర్ల కుటుంబంలో జులై 5 నుంచి జులై 7 వరకు వివాహ వేడుకలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడుగురికి జులై 8న ఎలక్షన్‌ డ్యూటీ వేస్తారనే కారణంతో వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఒక్కొక్కరు రూ.500 చొప్పున నామినేషన్‌ రుసుమును ఎన్నికల అధికారులకు చెల్లించి పంచాయతీ బరిలో నిలబడ్డారు. దీంతో వీరిని ఎన్నికల విధులకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)