మెటార్ బైక్‌కు అంత్యక్రియలు !

Telugu Lo Computer
0


బైకుకు అంత్యక్రియలు చేయటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేదో వైరల్ అవ్వటం కోసం చేయలేదు. పోలీసులకు తన నిరసనను ఈ విధంగా వ్యక్తపరిచాడు. అచ్చంగా మనుషులకు అంత్యక్రియలు చేసినట్లుగా కట్టెలు పేర్చి నిప్పు పెట్టాడు. ఎంతోఇష్టంగా కొనుక్కుని రోజు వారీ పనులపై తిరుగుతుంటే పోలీసులు పదే పదే చలాన్లు విధిస్తున్నారు. ఒక్క బైకుకు రోజుకు నాలుగు సార్లు చలాన్లు విధించటంతో కృష్ణకుమార్ అనే సామాజిక కార్యకర్తకు ఒళ్లు మండిపోయింది. ఏదో విధంగా ఈ విషయాన్ని తేల్చేయాలనుకున్నాడు. అందరికి తెలియజేయాలని అనుకున్నాడు. దాని కోసం వినూత్నంగా ఆలోచించాడు.తన మోటర్ బైకు చుట్టు కట్టెలు పేర్చాడు. కొత్త బట్ట కప్పాడు. ఓ పూలదండ వేశాడు. బైక్‌కు కాకుండా పక్కన ఉంచిన కర్రలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు సామాజిక కార్యకర్త కృష్ణకుమార్‌. ఈ కార్యక్రమంలో అనేక మంది చలాన్ల బాధితులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాట్నా నగరంలో పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేసి పదే పదే చలాన్లు విధిస్తున్నారని, నాకు రోజుకు నాలుగుసార్లు చలాన్‌ విధించి రూ.4 వేలు జరిమానా వేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే బైక్‌కు అంత్యక్రియలు నిర్వహించానని కృష్ణకుమార్‌ తెలిపారు. కాగా పాట్నా నగరంలో ఒక్కరోజునే చలాన్లు విధించి రూ.25.26 లక్షలు వసూలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా జరిమానాలు విధించి భారీగా వసూళ్లు చేస్తున్నారు.ఇటువంటి రూల్స్ ప్రతీరోజు ఉంటాయని ఎస్పీ స్పష్టంచేశారు. దీంతో జనాలు హడలిపోతున్నారు. చలాన్ల పేరుతో జనాల జేబులు ఖాళీ చేస్తున్నారని మండిపడుతున్నారు. పాట్నాతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో 103 సీసీ కెమెరాలు అమర్చి నిఘా కళ్లలో ఇట్టే పట్టేస్తున్నారు..అట్టా చలాన్లు విధించి వసూళ్ల పర్వంతో జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)