ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోమనీష్ సిసోడియా సహాయకుడిగా వ్యవహరించిన దినేష్ అరోరాను ఈడీ గురువారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఆయన్ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఇంకా లోతుగా విచారించాల్సి ఉన్నందున దినేష్ ఆరోరాను కస్టడీ కోరాలని ఈడీ భావిస్తుంది. ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జీ విజయ్ నాయర్ తో ఆయన సన్నిహితంగా వ్యవహరించారని ఈడీ గతంలో దాఖలు చేసిన చార్జీషీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆరోరా కలిశారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.అంతకుముందు పలుమార్లు ఈ కేసు విషయమై ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నాడు. ఇదే కేసులో మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 9వ తేదీన అరెస్ట్ చేశారు. https://t.me/offerbazaramzon
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా సహాయకుడి అరెస్టు
July 07, 2023
0
Tags