వారాహి రెండో దశ యాత్ర 9 ఏలూరు నుంచి ప్రారంభం

Telugu Lo Computer
0


నసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్ర రెండో దశ జులై 9 నుంచి ప్రారంభం కానుంది. ఏలూరు నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన రెండో దశ యాత్రకు సంబంధించి పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో చర్చించారు. ఏలూరులో జులై 9 (ఆదివారం) సాయంత్రం నిర్వహించనున్న సభతో యాత్ర రెండో దశ ప్రారంభం అవుతుంది. అదే రోజు ఏలూరు నియోజకవర్గంతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)