పెళ్లి కాని వారికి పెన్షన్ !

Telugu Lo Computer
0


ర్యానా ప్రభుత్వం పెళ్లి కాని వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయిస్తూ, 45-60 ఏళ్ల వయసున్న పెళ్లి కాని వారు ఇందుకు అర్హులుగా గుర్తించనుంది. ఈ మేరకు కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్వయంగా వెల్లడించారు. నెల రోజుల్లోగా ఈ పథకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నాల్‌లో జరిగిన జన్‌ సంవద్‌ కార్యక్రమంలో ఖట్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ 60 ఏళ్ల పెళ్లి కాని వ్యక్తి మాట్లాడుతూ పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనికి సీఎం బదులిస్తూ ''45 ఏళ్లు పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛను ఇచ్చేలా కొత్త పథకం తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టాం.నెలరోజుల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం'' అని తెలిపారు. ప్రస్తుతం సీఎం హామీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)