మణిపూర్‌ హింసాకాండపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి !

Telugu Lo Computer
0

ణిపూర్‌ హింసాకాండపై స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. సాయుధ దుండగుల నుండి ప్రజలను రక్షించడం, పునరావాసం కల్పించడం, ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు సంబంధించి తాజా నివేదికను సమర్పించాల్సిందిగా సిజెఐ డివై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో గ్రామాలు, హత్యల వివరాలకు సంబంధించి స్టేటస్‌కో నివేదికను కోర్టుకు సమర్పించానని కుకీ కమ్యూనిటీ తరుపున హాజరైన సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గోన్సాల్వెస్‌ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో హింసాకాండ తీవ్రమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుకీ కమ్యూనిటీని రూపుమాపుతామని కొంతమంది బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సాయుధ దుండగులను అడ్డుకోకుంటే హింస తీవ్రమౌతుందని, గత రాత్రి ముగ్గురు గిరిజనులను హత్య చేశారని, వారిలో ఒకరి తల నరికివేసి క్రూరంగా హత్య చేశారని తెలిపారు. తల నరికివేయడం మొదటి ఘటనగా పేర్కొన్నారు. మొయిటీ కమ్యూనిటీ కుకీ కమ్యూనిటీ గిరిజనులపై దాడి చేస్తోందని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఖండించారు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని, కర్ఫ్యూను కూడా ఐదుగంటలకు తగ్గించామని అన్నారు. దానిలో భాగంగా పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌, 114 కంపెనీల సిఎపిఎఫ్‌, 114 కాలమ్స్‌ ఆర్మీని మోహరించామని కోర్టుకు వివరించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)