లక్ష్మిపై దాడి చేసిన లల్లీ కూడా స్పందించింది. ఆమెతో ముందుగా తనకు ఎలాంటి గొడవలు లేవని, తన కూతురును ఉద్దేశిస్తూ పలుమార్లు యూట్యూబ్‌లో లక్ష్మి అసహ్యకరంగా మాట్లాడుతూ బూతులు తిట్టడం వల్లే ఆమెను క్టొటామని చెప్పింది. ఆమె మాట్లాడే మాటల వల్ల తన కూతురు మానసికంగా బాధపడుతుందని పేర్కొంది. అంతేకాకుండా లక్ష్మిని కొట్టినట్టు పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నానని చెప్పింది. రాకేష్ మాస్టర్ వద్దకు సుమారు రెండేళ్ల క్రితం వంట చేసేందుకు వచ్చిన లక్ష్మిని తన భార్యగా పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటికే రాకేష్ మాస్టర్‌కు యూట్యూబ్ ఛానల్ ఉండేది. అయనకు భారీగానే ఫాలోవర్స్ కూడా ఉండేవారు. రాకేష్ మాస్టర్, లక్ష్మిల మధ్య గొడవలు రావడంతో ఆమె మరో ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. ఆ సమయంలో రాకేష్ మాస్టర్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ను ఆమె లాక్కుందని, ఇప్పుడు దానిని ఆయన కుటుంబసభ్యులు తీసుకునేందకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే వీరందరూ కొట్టారని సమాచారం. https://t.me/offerbazaramzon
రాకేష్ మాస్టర్ భార్యపై మహిళల దాడి !
July 08, 2023
0
కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత కూడా రాకేశ్ మాస్టర్ పేరుతో పలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మిపై పలువురు దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో ఆమెపై ఐదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. స్కూటర్‌పై వెళ్తుండగా లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురి మహిళలతో వచ్చి దాడి చేయడం జరిగింది. ఆమెను నడిరోడ్డుపై ఇష్టమొచ్చినట్టు జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులకు స్ధానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. దాడి చేసిన మహిళలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. కొంత సమయం తర్వాత లల్లీతో పాటు నలుగురు మహిళలు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మొదట లక్ష్మినే తమను దూసించిందని వారు కూడా పలు ఆధారాలతో ఆమెపై కేసు పెట్టారు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారించి వారిని పంపించేశారు. లక్ష్మితో పాటు వారందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఇదే విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తనను రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని లక్ష్మి తెలిపింది. వీరందిరకి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించిందని ఆమె ఆరోపిస్తుంది. తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను క్లోజ్ చేసుకోవాలని కొంతకాలంగా వీరందరూ బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది. దుర్గ, లల్లీ,పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి తనపై దాడి చేశారని చెప్పింది.
Tags