కె.ఎం.వాసుదేవన్‌ నంబూద్రీ మృతి

Telugu Lo Computer
0


తెలుగునాట బాపూ బొమ్మలాగే మలయాళీలకు నంబూథ్రీ కళా చిత్రాలు మదిలో మెదులుతాయి. కేరళలోనే కాక దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న చిత్రకారుడు కె.ఎం.వాసుదేవన్‌ నంబూద్రీ 98 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో కొట్టక్కళ్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. రేఖా చిత్రాలతోపాటు వినోద ప్రధానమైన చిత్రపటాలు, శిల్పాల సృష్టిలోనూ ఆయన మేటి. మలయాళ సినిమాలకు కళా దర్శకత్వం కూడా చేశారు. దశాబ్దాల తరబడి చిత్రకారుడిగా కొనసాగిన నంబూథ్రీ జ్ఞానపీఠ్‌ విజేతలైన ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌, తగళి శివశంకర పిళ్లై, ఎస్‌.కె.పొట్టకాడ్‌ల రచనలకు చిత్రాలు అందించారు. వైకోం మహమ్మద్‌ బషీర్‌ రచనలకూ ఆయన చిత్రాలు వన్నె తెచ్చాయి. ఈయన చిత్రాలకు మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ వీరాభిమాని. రాజా రవివర్మ అవార్డుతో సహా ఎన్నో ముఖ్యమైన అవార్డులు ఆయన్ను వరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, నటుడు మోహన్‌లాల్‌ ఈ చిత్రకారుని మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)