ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లాలో ఓ వ్యక్తి 11 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడు, ముస్లి మతగురువు (మౌలానా)తో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాహిల్ తో మైనర్ బాలికకు వివాహం ముందుగానే నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం ఆగిపోయింది. ఈ ఘటనలో కోపం పెంచుకున్న సాహిత్ తన బంధువుల సహాయంతో మైనర్ బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబీకులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. https://t.me/offerbazaramzon
మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం !
July 11, 2023
0
Tags