మణిపూర్‌లో శాంతి నెలకొనేందుకు కుకీ, మైతీ తెగల ప్రజలు సహకరించాలని కోరుతూ శాంతికి మరో ప్రత్యామ్నాయం లేదని మణిపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరించాలని తాము కోరుతున్నామని, న్యాయంతో పాటు శాంతి స్ధాపనే తమ డిమాండ్ అని పేర్కన్నారు. రెండు తెగల ప్రజలు సామరస్యంతో నివసించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. మణిపూర్‌లో పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని, మధ్యప్రదేశ్ లేదా మణిపూర్ ప్రాంతం ఏదైనా శాంతికి ప్రత్యామ్నాయం లేదని గుర్తెరగాలని మనోజ్ ఝా స్పష్టం చేశారు. 21 మంది విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించి క్షేత్రస్ధాయి పరిస్ధితులతో కూడిన వివరాలతో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం విపక్ష బృందం తిరిగి ఢిల్లీకి చేరుకుంది. ఇక గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌లో ప్రజలు ఇంకా అభద్రతతో నలిగిపోతున్నారని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కుకీ, మైతీ తెగల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల్లోనూ ఇంకా అభద్రతాభావం నెలకొందని పేర్కొన్నారు.మే 3 నుంచి మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినా రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. మణిపూర్‌లో సాధారణ పరిస్ధితి నెలకొనేలా తాను చేయగలినదంతా చేస్తున్నానని తనను కలిసిన విపక్ష ఎంపీ ప్రతినిధి బృందంతో రాష్ట్ర గవర్నర్ అనసూయ పేర్కొన్నారని చెప్పారు.అయితే రాష్ట్ర గవర్నర్‌కు పరిమిత అధికారాలే ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వమే మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు చొరవ చూపాలని తాము కోరుతున్నామని అన్నారు. https://t.me/offerbazaramzon
మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణే లక్ష్యం !
July 30, 2023
0
Tags