కేంద్ర మంత్రిమండలి భేటీ చాలా ఫలప్రదంగా సాగింది !

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రిమండలి భేటీ ముగిసింది. త్వరలో కేంద్రమంత్రి మండలి పున: వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ భేటీపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్టు ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈ కీలక భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. కరోనా పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి. తొమ్మిదేళ్ల మోడీ  పాలన, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై మంత్రి మండలిలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. అలాగే, ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాల్సిన కీలక బిల్లులపై చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రి మండలిలో మార్పులు, చేర్పులపై ప్రధాని మోదీ ఈ భేటీలో సంకేతాలు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే కేంద్రమంత్రి మండలిని విస్తరించిన విషయం తెలిసిందే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)