కేరళలోని అలప్పుజాలో పడవ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం పడవ పోటీల సందర్భంగా పడవ బోల్తా పడింది. పడవలో 25 మంది మహిళలు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం అన్ని ఇతర పడవ పోటీలు నిలిపివేయబడ్డాయి. బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న 25 మంది మహిళలు నీటిలో మునిగిపోయారు. చంపకుళం పంచాయతీకి చెందిన కట్టిల్ తెక్కెతిల్ చుండన్, నేడుముడి పంచాయతీకి చెందిన స్నేక్ బోట్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే బోటు బోల్తా పడడంతో అందులో ఉన్న మహిళలు నీటిలో మునిగిపోయారు. స్థానిక మత్స్యకారులు, ఇతర చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. https://t.me/offerbazaramzon
పడవ పోటీల్లో అపశృతి !
July 03, 2023
0
Tags