గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బిస్రఖ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాలక్సీ ప్లాజా షాపింగ్‌ కాంప్లెక్స్‌ మూడో అంతస్తులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పలువురు భవనంపై నుంచి అమాంతం కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది గాయపడ్డారు, ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే విషయం తెలియరాలేదు. అయితే కాంప్లెక్స్‌లో ఎలక్ట్రీకల్‌ షార్ట్‌ సర్కిట్‌ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. షాపింగ్‌ కంప్లెక్స్‌లో నుంచి పొగ వెలువడటం, మూడో అంతస్తు కటికీ వద్ద ఇద్దరు వ్యక్తులు వేలాడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)