మణిపూర్‌ అంశంపై పార్లమెంటులో చర్చకు రండి!

Telugu Lo Computer
0


ణిపూర్‌ అంశంపై జరిగే చర్చలో పాల్గొనాలని 'చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా' అని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతోన్న దాడుల అంశాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 'రాష్ట్రం ఏదైనా మహిళలపై దాడులు జరగడం ఎంతో బాధాకరం. ఇటువంటి సంఘటనలను కట్టడి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. మణిపూర్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలన్నీ పాల్గొని ఈ అంశంపై మంచి చర్చ జరపాలని ఆశిస్తున్నాం. విపక్ష పార్టీలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, చర్చ నుంచి ఎవ్వరు కూడా పారిపోవద్దు. దయచేసి పార్లమెంటులో జరిగే చర్చలో పాల్గొనండి' అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై చర్చ జరపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విపక్షాలు చర్చలో మాత్రం పాల్గొనేందుకు వెనకాడుతున్నాయని విమర్శించారు. మణిపూర్‌ అంశంపై పార్లమెంటులో సోమవారం సంయుక్తంగా నిరసన చేపట్టాలని విపక్ష పార్టీలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. ఈ విషయంపై చర్చ జరగడం కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై పార్లమెంటులో ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, దీనిపై హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాత్రమే మాట్లాడుతారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)