వ్యాపారవేత్తను రూ.58 కోట్ల మేర మోసం చేసిన క్రికెట్ బుకీ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని గోండియాకు చెందిన క్రికెట్ బుకీ అనంత్​ నవరతన్ జైన్ ను వ్యాపారవేత్త 2021లో కలిశాడు. ఆన్​లైన్ బెట్టింగ్ ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని బుకీ వ్యాపారవేత్తను నమ్మించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్‌లతో సహా వివిధ గేమింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించాడు. తర్వాత ఎక్కువ మొత్తంలో వ్యాపారవేత్త బుకీకి డబ్బులు పంపించడంతో నిందితుడు మొత్తంగా రూ. 58 కోట్లతో ఉడాయించాడు. మోసపోయానని గ్రహించిన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. క్రికెట్ బుకీ అనంత్​ నవరతన్ జైన్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగ్‌పూర్‌లోని కాకా చౌక్‌లో ఉన్న క్రికెట్ బుకీ ఇంటిపై దాడి చేశారు. క్రికెట్ బుకీ ఇంట్లో కోట్లకు కోట్లు డబ్బులు ఉండటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుడి ఇంటి నుంచి పోలీసులు రూ. 17 కోట్లకు పైగా నగదు, 4 కిలోల బంగారం, 200 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఇంట్లో పట్టుబడిన డబ్బును పోలీసులు టెల్లర్ మిషన్‌ల సాయంతో లెక్కించడం గమనార్హం. అయితే పోలీసులు అతని నివాసంపై దాడి చేసేలోపే క్రికెట్ బుకీ అనంత్ నవరతన్ జైన్ పారిపోయాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)