దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో సీటు సంపాదించేందుకు ప్రతిఏటా లక్షల్లో విద్యార్థులు పోటీపడుతుంటారు. కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకొని సీటు పొందుతారు. అలా అక్కడ ప్రవేశం పొందిన కొందరు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. 2019 నుంచి 2023 మధ్య 8 వేల మందికిపైగా ఐఐటీ విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారని కేంద్రమంత్రి సుభాస్ సర్కార్ రాజ్యసభలో వెల్లడించారు. అలాగే 2018 నుంచి 39 మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 98 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అందులో ఐఐటీల నుంచి వచ్చిన సంఖ్యే 39. ఎన్‌ఐటీల్లో 25, సెంట్రల్ యూనివర్సిటీల్లో 25, ఐఐఎంల్లో 4, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో 3, ట్రిపుల్ ఐటీల్లో ఇద్దరు మృతి చెందారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం.. ఈ ఆత్మహత్యలకు మానసిక, కుటుంబ సమస్యలు, చదువుల్లో ఒత్తిడి, ఒంటరివారమనే భావన కారణమని ఆయన తెలిపారు. మధ్యలో చదువు మానేసేవారి సంఖ్య సెంట్రల్ యూనివర్సిటీ(17,454)ల్లో ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఐఐటీ(IIT)ల్లో 8,139, ఎన్‌ఐటీల్లో 5,623, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో 1,046, ఐఐఎంల్లో 858, ట్రిపుల్ ఐటీల్లో 803 మంది చదువును మధ్యలో ఆపేశారని తెలిపారు. మొత్తంగా 2019 నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ఈ సంఖ్య 32 వేలుగా ఉందని వెల్లడించారు. https://t.me/offerbazaramzon
ఐఐటీ చదువును మధ్యలోనే 8వేల మంది ఆపేశారు !
July 27, 2023
0
Tags