ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం బెంగళూరులో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ట్వీట్ చేశారు. 'తాము గత నెల బీహార్ రాజధాని పట్నాలో నిర్వహించుకున్న తొలి సమావేశం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అదే ఊపుతో ఈ నెల 17, 18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నాం. నియంతృత్వ, అప్రజాస్వామిక శక్తులను ఓడించడమే లక్ష్యంగా మేం పనిచేస్తున్నాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఓ సాహసోపేతమైన లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం' అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశం కావాలని ముందుగా నిర్ణయించుకున్నాయి. తొలి సమావేశం ముగియగానే ఈ విషయాన్ని వెల్లడించాయి. కానీ ఆ తర్వాత సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి. దాంతో ఇక ప్రతిపక్షాల రెండో సమావేశం లేనట్లే అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ట్విటర్‌లో తేదీలు ప్రకటించి సమావేశంపై క్లారిటీ ఇచ్చారు. https://t.me/offerbazaramzon
ప్రతిపక్షాల సమావేశం 17, 18 తేదీకి వాయిదా
July 03, 2023
0
Tags