ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలి అనే గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఒక మగ పిల్లాడు పుట్టాడు. ఫతేపూర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవం జరిగింది. చిన్నారి మొదటి మూడు, నాలుగు రోజులు ఆరోగ్యంగానే ఉంది. అయితే ఉన్నట్టుండి పాలు తాగకపోవడంతో తల్లి ఆసియా తీవ్ర ఆందోళను గురైంది. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిలో ఆ వ్యక్తి ఇచ్చిన సూచన మేరకు చిన్నారి వేళ్లను కాలుతున్న నూనెలో ముంచింది. రాత్రి విధుల్లో ఉన్న నర్సు ఇది గమనించి వెంటనే వైద్యుడికి సమాచారం అందించింది. ఆసియా వార్డుకు చేరుకున్న వైద్యుడు.. చిన్నారికి వైద్యం చేసి ఆసియాపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే గతంలో ఇలాగే పిల్లలు పాలు తాగక ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది ఆసియా. ఆ భయంతోనే ఇలా చేసిందని పోలీసుల విచారణలో తేలింది.
పాలు తాగడం లేదని చిన్నారి వేళ్లను కాలుతున్న నూనెలో ముంచిన తల్లి
June 17, 2023
0
Tags