మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వా గ్రామానికి చెందిన ఓ యువతిని వెంటపడి వేధిస్తున్నాడు ఓ యువకుడు. అంతేకాకుండా పెళ్లి చేసుకోవాలని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో యువతితో పెళ్లి అయినట్లు సర్టిఫికేట్ తయారు చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. అంతేకాకుండా అతనికి సహకరించిన మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాల ద్వారా వివాహ ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి తన పరువు తీశారని గ్రామానికి చెందిన యువతి ఆరోపించింది. ముఖ్యంగా బోనఫైడ్ సర్టిఫికెట్, నా అనుమతి లేకుండా స్కూల్‌లో ఉన్న ఫోటో తీసుకొని వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేయించాడని తెలిపింది. అంతకుముందు ఆ యువకుడు తనను బెదిరించాడని, నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని ప్రాణాలతో విడిచిపెట్టబోనని అన్నాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఇదే విషమయై గ్రామంలో పంచాయతీ ఏర్పాటు చేయగా ఊరి పెద్దలు అతనికే సహకరించినట్లు పోలీసులకు తెలిపింది. మానసికంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ పై బయటికొచ్చిన నిందితుడు తౌసిఫ్ షేక్లా.. మళ్లీ అలానే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతను మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని, కాలేజీకి వెళ్లడం కూడా కష్టంగా ఉందని బాధితురాలు తెలిపింది. నిందితుడు తౌసిఫ్ షేక్ ఒక నేరస్థుడని, ఒక హత్య కేసులో అతను జైలుకు కూడా వెళ్ళినట్లు బాలిక తెలిపింది. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నకిలీ వివాహ ధృవీకరణ పత్రాలతో వేధిస్తున్నాడు !
June 17, 2023
0
Tags