టర్కీలో సమంత !

Telugu Lo Computer
0


ఖుషీ సినిమా షూటింగ్ కోసం సమంత టర్కీలో ఉన్నారు. అక్కడ వర్కౌట్లు చేస్తున్న ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు. అవి చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘బాధను పంచుకోవడంలో కూడా ఎప్పుడూ సంతోషం ఉంటుంది’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు. అలసిపోయిన తర్వాత ఐస్ క్రీం తింటున్నట్లు చేత్తో ఐస్ క్రీం కప్పు పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు శామ్. సమంత ఓ పబ్లిక్ బూత్ దగ్గర రిసీవర్‌ను పట్టుకుని చిరునవ్వుతో ‘కాలింగ్ హోప్’ అని రాసిన ఫోటోను షేర్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. గతేడాది కాశ్మీర్‌లో సగ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమంత అనారోగ్య కారణాల వల్ల కాస్త లేటైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)