నేటి నుంచి జాతీయ యువజన కాంగ్రెస్‌ సమావేశాలు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ క్షత్రియ హోటల్‌లో జాతీయ యువజన కాంగ్రెస్‌ సమావేశాలను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు హాజరుకానున్నారు. యువజన జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌, జాతీయ ఇంఛార్జి కృష్ణ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శులు, కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలల్లో యువజన కాంగ్రెస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరు కానున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే ముఖ్య అతిధిలుగా హాజరుకానున్నారు. తెలంగాణలో జాతీయస్థాయి యువజన కాంగ్రెస్‌ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)