పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే !

Telugu Lo Computer
0


ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌ (18046), సికింద్రాబాద్ -షాలిమార్‌ (12774), విల్లుపురం-ఖరగ్‌పూర్‌ (22604), హౌరా-ఎస్‌ఎంవీ బెంగళూరు (22887) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎస్‌ఎంవీ బెంగళూరు- హౌరా (22864), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- షాలిమార్‌ (22826).. 22వ తేదీన పాట్నా-ఎర్నాకుళం (22644), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- సంత్రాగచ్చి (22808) రైళ్లను రద్దు చేశారు. ఈనెల 25వ తేదీవరకు విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ రెండు డివిజన్ల పరిధిలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు (17239) గుంటూరు -విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 నుంచి 25వ వరకు.. అలాగే రైలు నంబరు. (17240) విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ నెల 21న (07629) విజయవాడ - తెనాలి, (07874) తెనాలి - రేపల్లె, (07875) రేపల్లె - తెనాలి, ఈ నెల 22వ తేదీన (07282) తెనాలి - గుంటూరు, 24వ తేదీన (07783) విజయవాడ - గుంటూరు రైళ్లను రద్దుచేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీవరకు కాచిగూడ - నడికుడి (07791 ), నడికుడి - కాచిగూడ (07792 ), గుంటూరు - విజయవాడ (07783), గుంటూరు - మాచర్ల (07779 ), మాచర్ల - గుంటూరు (07780), మాచర్ల - నడికుడి (07580 ), నడికుడి - మాచర్ల (07579 ), నరసాపూర్ - గుంటూరు (17282), గుంటూరు - నరసాపూర్ (17281 ), గుంటూరు డోన్ ఎక్స్‌ప్రెస్‌ (17228 ) కూడా రద్దయ్యాయి. డోన్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17227)ను ఈనెల 26వ తేదీవరకు రద్దు చేశారు. రేపల్లె -మార్కాపురం రోడ్డు (07889) రైలుని ఈ నెల 25వ తేదీ వరకు గుంటూరు వరకే నడపనున్నారు. మార్కాపురం రోడ్డు - తెనాలి రైలు (07890)ని మార్కాపురం నుంచి గుంటూరు మధ్య రద్దు చేశారు. దీన్ని గుంటూరు - తెనాలి మధ్య నడుపుతున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో 28 రైళ్లను ఈ నెల 25వ తేదీవరకు రద్దు చేశారు. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. నిర్వహణ పనులు చేపడుతుండటంతో కాజీపేట-డోర్నకల్‌-కాజీపేట, భద్రాచలంరోడ్‌-విజయవాడ-భద్రాచలంరోడ్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌-సికింద్రాబాద్‌, డోర్నకల్‌-విజయవాడ-డోర్నకల్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌-సికింద్రాబాద్‌, కరీంనగర్‌-నిజామాబాద్‌-కరీంనగర్‌, కాచిగూడ-నడికుడి-కాచిగూడ రైళ్లను రద్దు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)