సంగీతం ప్రయాణాన్ని ఎంత ఉల్లాసంగా మార్చేస్తుంది !

Telugu Lo Computer
0


ముంబయి లోకల్ ట్రైన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉద్యోగాలు, కాలేజీలు.. ఇతర పనుల మీద వెళ్లేవారితో నిత్యం జనంతో కిటకిటలాడుతుంది. ఈ ఎండల్లో లోకల్ ట్రైన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కష్టాన్ని మర్చిపోతూ హాయిగా కిషోర్ కుమార్ సాంగ్ 'ఓ మేరే దిల్ కే చైన్' పాడుకుంటూ.. స్టెప్పులు కూడా వేస్తూ ఎంజాయ్ చేసారు కొందరు ప్రయాణికులు. sashankpandeyy అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ 'ఎవరు చెప్పారు మేము లోకల్ ట్రైన్‌లో ఫైటింగ్స్ మాత్రమే చేస్తామని' అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.నిత్యం కొట్లాటలు.. అరుపులతో సాగే రైలు ప్రయాణం చక్కని పాటతో హాయిగా సాగడం చూసేవారి మనసు కూడా దోచుకుంది. సంగీతం ప్రయాణాన్ని ఎంత ఉల్లాసంగా మార్చేస్తుందో.. ఎంత స్నేహ పూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)