నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్స్‌పై ఒక ఆఫర్ అందుబాటులో ఉంచింది. వడ్డీ రేటుపై డిస్కౌంట్ అందిస్తోంది. బజాజ్ ఫిన్‌సర్వ్ హోమ్ లోన్స్‌పై ఇది వరకు వడ్డీ రేటు 8.6 శాతం నుంచి ప్రారంభం అయ్యేది. అయితే ఇప్పుడు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచే స్టార్ట్ అవుతోంది. హోమ్ లోన్ టెన్యూర్ దీర్ఘకాలం వరకు ఉంటుంది. అందువల్ల వడ్డీ రేటులో ఏ కొంచెం తగ్గుదల కనిపించినా కూడా దాని బెనిఫిట్ దీర్ఘకాలంలో ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి కస్టమర్లు రూ. 15 కోట్ల వరకు హోమ్ లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. రూ.లక్షకు రూ. 769 నుంచి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్ అప్రూవల్ 48 గంటల్లోనే పొందొచ్చని బజాజ్ ఫిన్‌సర్వ్ పేర్కొంటోంది. హోమ్ లోన్ టెన్యూర్ 30 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా హోమ్ లోన్‌పై ఎలాంటి ఫోర్ క్లోజర్ చార్జీలు ఉండవని ఈ ఫైనాన్స్ కంపెనీ పేర్కొంటోంది. అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ కూడా ఉంది. కనీసం రూ. 20 లక్షల నుంచి లోన్ పొందాల్సి ఉంటుంది. రూ. 15 కోట్ల వరకు ఎంతైనా లోన్ అమౌంట్ పొందొచ్చు. అర్హత ప్రాతిపదికన ఎంత లోన్ వస్తుందనే అంశం ఆధారపడి ఉంటుంది. కాగా బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి లోన్ పొందాలని భావించే వారు కచ్చితంగా సిబిల్ స్కోర్ 750 కలిగి ఉండాలి. ప్రాసెసింగ్ ఫీజు 7 శాతం వరకు ఉంటుంది. బౌన్స్ చార్జీలు రూ. 3 వేల వరకు పడతాయి. పార్ట్ పేమెంట్ చార్జీలు కూడా ఉండవు. ఉద్యోగులకు వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 14 శాతం వరకు ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వారికి వడ్డీ రేటు 9.1 శాతం నుంచి 15 శాతం వరకు పడుతుంది. డాక్టర్లకు అయితే వడ్డీ రేటు 8.6 శాతం నుంచి 14 శాతం వరకు ఉంటుంది.
బజాజ్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ !
June 05, 2023
0
Tags