ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్

Telugu Lo Computer
0


దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానాన్ని నిలుపుకొంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది. మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐఎస్​సీ బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్​ అత్యుత్తమ ఇంజినీరింగ్​ విద్యాసంస్థల్లో వరుసగా ఎనిమిదో సారి అగ్రస్థానం సంపాదించింది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐటీ దిల్లీ​, ఐఐటీ బాంబే నిలిచాయి. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ కింద కేంద్ర విద్యాశాఖ.. సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది. పరిశోధన విభాగంలో ఐఐఎసీ బెంగళూరు ఉత్తమమైన సంస్థగా నిలిచింది. ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణకు అత్యుత్తమ ర్యాంక్‌ను సంపాదించుకుంది. ఫార్మసీ రంగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. మొదటి స్థానం సంపాదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)