మదర్సాల నుంచే లవ్ జిహాద్ మొదలవుతుందని, మదర్సాలు మూసివేసిన రోజు ‘లవ్ జిహాద్’ ఉనికిలో ఉండదని విశ్వహిందూ పరిషద్ నేత సాధ్వి ప్రాచి అన్నారు. అదే జరిగితే భారతదేశంలోనే కాకుండా ఏకంగా ప్రపంచం మొత్తంలో శాంతి, సామరస్యం ఉంటుందని ఆమె అన్నారు. "హిందువులు డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు, అయితే భారతదేశాన్ని పాలించడం గురించి ఆలోచించే ఒక ప్రత్యేక సంఘం ఉంది. భారతదేశాన్ని పాలించాలనే వారి ఎజెండా వేల సంవత్సరాలుగా ఉంది'' అని ముస్లింలను ఉద్దేశించి సాధ్వి అన్నారు. “వాళ్ళేం చేస్తున్నారు ? నేషనల్ హైవే మీద పంక్చర్ షాప్ నడిపిస్తారు. కానీ సిటీలో వీధుల్లో పంక్చర్ షాప్ ఎందుకు కనిపించదు?” అని అన్నారు. ముస్లింలు ఒక ఎజెండా ప్రకారం వెళ్తున్నారని, వారి లక్ష్యం ఈ దేశాన్ని పాలించడమేనని, అయితే దాన్ని ఆపాలని సాధ్వి అన్నారు.
సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు !
June 11, 2023
0
Tags