కర్ణాటకలో ఉచిత ప్రయాణ వసతి పథకంతో మహిళలందూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ప్రైవేటు బస్సులు వెలవెలపోతున్నాయి. మహిళలు రాష్ట్ర పరిధిలో ఎక్కడినుంచైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శక్తి యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. మహిళలు ప్రైవేటు బస్సులపై కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రైవేటు బస్సులు బస్టాండ్లలో ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు టాప్ సర్వీస్‌లతో నడిచిన తమ బస్సులు ఇప్పుడు బోసిపోయాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్లు లేకపోతే తమకు జీతాలు రావని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుల్లేక ప్రైవేటు బస్సులు వెలవెల
June 15, 2023
0
Tags