మహారాష్ట్ర పూణే జిల్లా డాండ్ మండలం వార్వాండ్ గ్రామంలో అతుల్ దివేకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా పశు వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. అయితే, అతుల్ దివేకర్ గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే కొనసాగింది. కొన్నాళ్లకి వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇకపోతే, ఈ మధ్యకాలంలో ఈ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునేవారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త అతుల్ దివేకర్.. భార్యను ఉరి తీసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలను కూడా హత్య చేసి దగ్గరలోని ఓ చెరువులో పడేశాడు. అనంతరం అతుల్ దివేకర్.. భార్య వేధింపుల కారణంగానే ఇలా చేశానంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
భార్యా, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త!
June 22, 2023
0
Tags