ఉత్తరప్రదేశ్ లోని మీరట్ మున్సిపల్ కమిషనర్ సెల్వకుమారి జర్మన్ షెపర్ట్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క అంటే ఆమెకు చాలా ప్రేమ. ఇలాంటి కుక్కలు మీరట్ నగరం మొత్తం మీద 19 మాత్రమే ఉన్నాయట. ఈక్రమంలో గత ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కమిషనర్ గారి జర్మన్ షెపర్ట్ కుక్క కనిపించకుండా పోయింది. కమిషనర్ ఇంట్లో సెంట్రీ గా పనిచేస్తున్న సిబ్బంది తెగ కంగారుపడిపోయారు. ఆ చుట్టుపక్కల అంతా వెదికారు. కానీ కనిపించలేదు. మేడమ్ ఏమంటారోనని భయపడ్డారు. కానీ విషయం ఎట్టకేలకు మేడమ్ దష్టికి వచ్చింది. దీంతో సిటీలో ఆనిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ హర్పాల్ సింగ్ అర్ధరాత్రి కమిషనర్ ఇంటికి చేరుకుని కమిషనర్ పెంపుడు శునకం పేరు, ఫొటో వివరాలు తీసుకుని స్వయంగా వెతకడం మొదలు పెట్టారు. అయినా ఉపయోగంలేకుండా పోయింది. ఎవరైనా కావాలనే ఎత్తుకెళ్లిపోయారనే అనుమానంతో సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.. అయినా కమిషనర్ పెంపుడు కుక్క మాత్రం దొరకలేదు. కానీ స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆ కుక్క దొరికినట్లుగా తెలుస్తోంది.
మీరట్ మున్సిపల్ కమిషనర్ గారి కుక్క పోయింది !
June 27, 2023
0
Tags