కర్ణాటక మంత్రి రామలింగా రెడ్డి శనివారం బసవన గుడి ఆలయంలో పాల్గొన్నారు. అనంతరం ఆ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ 65 ఏళ్ల పైడిన వారంతా తమ గుర్తింపు కార్డును చూపించి నేరుగా ఆలయ దర్శనానికి వెళ్లొచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కేటగిరిలో 205, బీ కేటగిరిలో 193 దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయని, ఈ ఆలయాల్లో ఈ తాజా నిబంధలను వర్తిస్తాయని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఏ,బీ కేటగిరిలో ఉన్న దేవాలయాల దర్శనానికి వస్తున్న 65 ఏళ్లు పైబడి వృద్ధులు దర్శనంలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఆయన నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
65 ఏళ్ల పైబడిన వారు నేరుగా ఆలయ దర్శనానికి వెళ్లొచ్చు !
June 27, 2023
0
Tags