'గర్భవతి కావడానికి నేనే కారణమా?'

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో సంచలనంగా మారిన అప్సర హత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోమని అప్సర ఒత్తిడి తీసుకురావడమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే గతంలో అప్సర గర్భవతి అని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తుండగా దీనిపై నిందితుడు పూజారైన సాయికృష్ణ పోలీసులతో వాదించినట్లు తెలుస్తుంది. అప్సర గర్భవతి అయితే అందుకు కారణం తానేనా అని పోలీసులను సాయి ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇక సాయి తనకు తరచూ అక్కా అని పిలిచేవాడని అప్సర తల్లి చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ ఇంటికి కూరగాయలు, సరుకులు తెచ్చి ఇచ్చేవాడని, సాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అప్సరకు లేదని ఆమె తెలిపింది. తన భర్త కాశీలో ఉంటున్నాడని, తాను అప్సరతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నట్టు అప్సర తల్లి తెలిపారు. ఇక అప్సర, సాయి తరచూ బైక్ లపై తిరిగేవారని, వారిద్దరూ కలిసి మెలిసి ఉండేవారని స్థానికులు చెప్పుకొచ్చారు. రోజూ అప్సర ఇంటికి సాయి వచ్చేవాడని స్థానికులు తెలిపారు. మరోవైపు అప్సర డెడ్ బాడీని మ్యాన్ హోల్ నుంచి తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పూజారి అయిన సాయికృష్ణ పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను ట్రాప్ చేసి తన కారులో తీసుకెళ్లాడు. అయితే ఆ యువతి మాత్రం తాను కోయంబత్తూరు వెళ్తున్నట్టు తల్లికి చెప్పింది. ఈ క్రమంలో ఫోర్డు కారులో వెళ్తున్న క్రమంలో శంషాబాద్ దాటగానే రాళ్లగూడ వైపు కారు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. అనంతరం అప్సర కారులోని ఫ్రంట్ సీటులో కూర్చుని రిలాక్స్ అవుతుంది. ఇంతలో మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇక ఇదే అదునుగా భావించిన పూజారి సాయికృష్ణ తన వెంట తెచ్చుకున్న బెల్లం దంచే దుడ్డు కర్రతో తలపై దాడి చేసి చంపేశాడు. ఆ తరువాత అప్సర డెడ్ బాడీని అదే కారులో ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆరోజు మొత్తం పార్కింగ్ లో ఉన్న కారులో డెడ్ బాడీ ఉంచాడు. ఆ మరుసటి రోజు సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో అప్సర మృతదేహాన్ని సాయి పడేశాడు. అయితే తన కూతురు కనిపించడం లేదని అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులకుఆ సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని ప్రశ్నించగా పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)