మళ్లీ తెరపైకి మీటూ కేసు !

Telugu Lo Computer
0


కన్నడ నటి శుత్రి హరిహరన్‌ మీటూ కేసు కొత్త మలుపు తిరిగింది. బీ రిపోర్ట్‌ ప్రశ్నిస్తూ శ్రుతికి కోర్టు నోటీసు జారీ చేసింది. బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతికి నోటీసు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని పోలీసులకు సూచించింది. 2018లో బహుభాష నటుడు అర్జున్‌పై నటి శుత్రి హరిహరన్‌ మీటూ ఆరోపణలు చేసింది. కేసుకు సంబంధించి అర్జున్‌పై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు బీ రిపోర్టు సమర్పించారు. దీంతో కోర్టు శ్రుతికి, పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)