కొండచిలువతో ఆడుకుంటున్న పసివాడు !

Telugu Lo Computer
0


ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో ఓ చిన్నారి కొండచిలువతో ఆటలు మొదలుపెట్టాడు. దాని తల ఎత్తి కింద పడేయడానికి ప్రయత్నించాడు. దానిపై ఎక్కి జారుతూ వదిలిపెట్టకుండా వెంబడించాడు. కొండచిలువ అతనిని చూసి కలవరపడలేదు. చిన్నారి కూడా ఏ మాత్రం భయపడలేదు. ఇక ఇదంతా చూసిన వారికి మాత్రం వణుకు వచ్చింది. ఒకవేళ కొండచిలువ బాలుడికి హాని చేస్తే అనే ఆలోచనే ఆందోళనకు గురి చేసింది. ఈ వీడియోను @TheFigen అనే ట్విట్టర్ యూజర్ 'బాధ్యతా రహితమైన తల్లిదండ్రులు' క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది పిల్లవాడి భద్రత గురించి ఆందోళన చెందారు.. మరికొంతమంది ఆ పిల్లవాడు భయ పడకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఒక్కోసారి పరిస్థితులు ప్రమాదకరంగా మారవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)