తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటకకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌లో చేరికలపై ప్రధానంగా చర్చించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై కూడా అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో డీకే శివ కుమార్ పేరు హైలైట్ అవుతోంది. డీకే చుట్టే కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి.
డీకేతో కోమటిరెడ్డి భేటీ !
June 23, 2023
0