ముంబైలో భారీ వర్షం !

Telugu Lo Computer
0


ముంబైలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో భారత వాతావరణ శాఖ శనివారం ముంబైకి ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రాబోయే 4-5 రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం నైరుతి రుతుపవనాలు శనివారం(జూన్ 24) నగరానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం తీవ్రత క్రమంగా పెరుగుతుంది. రాబోయే 5 రోజుల్లో(జూన్ 25, 26, 27,28,29) తీవ్రమైన వాతావరణాన్ని అంచనా వేస్తున్నట్టు ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఎల్లోఅలర్ట్ అంటే నివాసితులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్ర, శనివారాల్లో మహారాష్ట్రలోని ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ జూన్ 26,27 తేదీలలో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. రాయ్‌గఢ్, థానే, పాల్ఘర్ మరియు ముంబై జిల్లాల్లో శనివారం ( జూన్ 24)నుంచి తేలికపాటి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిపార్జోయ్ తుఫాను కారణంగా దాదాపు 10 రోజుల ఆలస్యం తర్వాత జూన్ 23-25 మధ్య రుతుపవనాలు ముంబైకి వస్తాయని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. జూన్ 11న రుతుపవనాలు రత్నగిరి తీరప్రాంతానికి చేరుకున్నప్పటికీ, బిపార్జోయ్ తుఫాను కారణంగా ఎటువంటి పురోగతి సాధించలేకపోయిందని ముంబై వాతావరణ శాఖాధికారి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)